Top
logo

పవన్ కళ్యాణ్ పిలుపు.. 'నేనుసైతం' అంటూ ప్రతి ఒక్కరూ స్పందించండి!

పవన్ కళ్యాణ్ పిలుపు.. Pawan Kalyan (File Photo)
Highlights

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను తారుమారు చేస్తోంది. ఇక మన దేశంలోనూ చుట్టబెట్టేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను తారుమారు చేస్తోంది. ఇక మన దేశంలోనూ చుట్టబెట్టేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ప్రజలంతా ఇంటినుంచి కదల లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు అన్నిరకాలుగానూ ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు ప్రజలకు అండగా ఉండేందుకు తమవంతుగా ఆర్ధిక సహాయం ప్రకటిస్తూ వస్తున్నారు.

ఇక ఇందుకోసం ప్రతిఒక్కరూ తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా అయన ఓ ప్రకటన చేశారు. కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరూ 'నేను సైతం' అంటూ ముందుకు కదలాలని చెప్పారు. ఇందుకోసం 100 రూపాయల పైన ఎంత వీలైతే అంత మొత్తం PM CARESకు విరాళం ఇచ్చి సహకరించాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా ప్రధాని మోడీకి నైతిక మద్దతు తెలపడంతో బాటు మరో నలుగురికి విరాళాలు ఇచ్చేలా స్ఫూర్తిగా నిలుద్దామని అన్నారు. ఇందుకోసం రేపు అంటే ఏప్రిల్ 3 వ తేదీన అందరూ విరాలాలిచ్చి మానవత్వాన్ని చాతుకుందాం అని పవన్ కళ్యాన్ పిలుపు ఇచ్చారు.


Web TitleJanasena chief Pawan kalyan appeal people to donate funds for pm care
Next Story