Pawan Kalyan: వైసీపీ అనేది రౌడీల మూక... గూండాల గుంపు..

Pawan Kalyan: ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 4 Jun 2022 8:17 PM IST
Jana Sena Chief Pawan Kalyan Slams YSRCP Govt
X

Pawan Kalyan: వైసీపీ అనేది రౌడీల మూక... గూండాల గుంపు..

Pawan Kalyan: ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు. పచ్చని పరిసరాలతో ప్రశాంతంగా ఉన్న కోనసీమలో చిచ్చురేపారని మండిపడ్డారు. వైసీపీ నేతలు పగడ్బందీ పథకం ప్రకారమే కోనసీమలో అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు. కోనసీమలో అల్లర్లను కుల ఘర్షణగా మార్చేందుకు ప్రభుత్వ ప్రతినిధులు ప్రయత్నించారన్నారు. వైసీపీ అనేది రౌడీల మూక... గూండాల గుంపని అభివర్ణించారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ పెట్టి, ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే.. కోనసీమలో అధికార పార్టీ నేతలు సృష్టించిన అల్లర్లు చాలా బాధాకరమని అన్నారు. ఇది బహుజన సిద్ధాంతంపై, బహుజన ఐక్యతపై దాడి చేసినట్లుగా జనసేన భావిస్తోందని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story