Jagan: ఇవాళ వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

Jagan: 10,132 జంటలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

Jyothi
Published on: 20 Feb 2024 8:42 AM IST
Jagan to Release YSR Kalyanamasthu and YSR Shadi Tofa
X

Jagan: ఇవాళ వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

Jagan: ఏపీ సీఎం జగన్ సర్కార్ నిరుపేద యువతుల వివాహాలకు సహకారం అందించేందుకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పథకాలను అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం వైఎస్సార్ కల్యాణ మస్తు, ముస్లిం మైనారిటీల కోసం వైఎస్సార్ తోఫాను అందిస్తూ వస్తుంది. తాజాగా మరో 10,132 జంటలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈ పథకం కింద 10,132 జంటలకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో 78కోట్ల 53లక్షల ఆర్థిక సాయాన్ని ఇవాళ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో సంబంధిత సొమ్మును సీఎం జగన్ జమ చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story