తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్.. జగన్‌ను విమానాశ్రయంలోనే నిలువరించే ఆలోచన

Tirupati Airport: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Sept 2024 7:42 AM IST
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్.. జగన్‌ను విమానాశ్రయంలోనే నిలువరించే ఆలోచన
X

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్.. జగన్‌ను విమానాశ్రయంలోనే నిలువరించే ఆలోచన

Tirupati Airport: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్ నెలకొంది. జగన్ పర్యటనను నిరసిస్తూ ఇప్పటికే అధికార కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని కూటమి నేతలు చెప్పడంతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇప్పటికే పలువురు కూటమినేతలు అలిపిరి.. చేరుకున్నారు. ఈనేపథ్యంలోనే జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వస్తుండటంతో ఎయిర్‌పోర్ట్‌లోనే జగన్‌ను నిలువరించేందుకు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వెనక్కి తిప్పి పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో తిరుపతి తిరుమలలో సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story