Jagan: అర్హులైనా.. పథకం లబ్ది పొందని వారికి మరో అవకాశం

Jagan: రెండో సారి అవకాశం ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం

Jyothi
Published on: 5 Jan 2024 10:46 AM IST
Jagan Released Welfare Benefits Funds
X

Jagan: అర్హులైనా.. పథకం లబ్ది పొందని వారికి మరో అవకాశం

Jagan: అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. అర్హులైన లబ్దిదారుల ఖాతాలో 97. 76 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు సీఎం జగన్. ఇప్పటికే నాలుగున్నరేళ్లలో డీబీటీ రూపంలో లబ్దిదారులకు 2 లక్షల 46 వేల 551 కోట్లు జమ చేశారు. ఇలా ప్రతి ఏడాది రెండు పర్యాయాలు.. జనవరి నుంచి జూన్‌ వరకూ అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ది చేకూరని వారికి జూన్, జూలైలో.. జూలై నుంచి డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాల్లో లబ్ది జరగని వారికి డిసెంబర్, జనవరిలో అందించేందుకు.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికంగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Jyothi

Jyothi

Next Story