ఏపీలో కలకలం రేపుతోన్న మరో డాక్టర్ అనితారాణి ఉదంతం

Samba Siva Rao
Published on: 9 Jun 2020 3:31 PM IST
ఏపీలో కలకలం రేపుతోన్న మరో డాక్టర్ అనితారాణి ఉదంతం
X

విశాఖలో డాక్టర్ సుధాకర్ వివాదం మరవకముందే ఏపీలో ఇప్పుడు మరో డాక్టర్ వ్యవహారం దుమారం రేపుతోంది. వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ అనితారాణి ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. ఘటనపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. నిజానిజాలేంటో తేల్చాలంటూ ఆదేశారు జారీ చేశారు సీఎం జగన్. మరో వైపు అనితా రాణి వ్యవహారాన్ని రాష్ర్ట మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.

చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అనితా రాణి అధికార పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆసుపత్రిలో కింది స్థాయి ఉద్యోగుల అవినీతిని ప్రశ్నించినందుకు వేదింపులకు గురి చేస్తున్నారని డాక్టర్ అనితారాణి ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ నేతలు తనను నిర్బంధించి వేధిస్తూ అసభ్య పదజాలంతో దూషించారని తెలిపింది.

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న తపనతో అమెరికాలో ఉద్యోగం వదులుకున్నానని డాక్టర్ అనితా రాణి చెబుతుంది. పెనమూరు ఆసుపత్రిలో అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెవడంతో తనపై కక్ష గట్టారని ఆరోపించింది. మార్చి 22న వైసీపీ నేతలు తనను పిలిపించి గదిలో బంధించారని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారని చెబుతుంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లోనూ స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ అనితా ఆరోపించారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితతో ఫోన్లో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ లేదని మహిళా కమిషన్ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయిందని డాక్టర్ అనితా రాణి ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలంటూ హైకోర్టును ఆశ్రయించానట్లు తెలిపింది. మహిళా డాక్టర్ పై వైసీపీ నేతలు దాష్టికానికి పాల్పడ్డారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లాలో పెనమూరు ఆరోగ్యం కేంద్రంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

డాక్టర్ అనితా రాణి వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. నిజానిజాలేంటో తేల్చాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story