Jagan: టీడీపీ మాదిరిగా దోచుకోవడం.. పంచుకోవడం నేను చేయడం లేదు

Jagan: పేదలకు ఇళ్లు ఇస్తుంటే.. వీరికి కడుపు మండుతోంది-

Jyothi
Published on: 12 May 2023 1:31 PM IST
Jagan Comments On Chandrababu And Pawan Kalyan
X

Jagan: టీడీపీ మాదిరిగా దోచుకోవడం.. పంచుకోవడం నేను చేయడం లేదు

Jagan: రైతులకు మేలు జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, పవన్ డ్రామాలు నమ్మొద్దని, చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం దత్తపుత్రుడు పొలిటికల్ యాక్షన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి తోడు వారి గజదొంగల ముఠా పని చేస్తోందన్నారాయన... వీరికి డీపీటీ మాత్రమే తెలుసంటూ.. డీపీటీకి దోచుకో, పంచుకో, తినుకో అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు జగన్... చంద్రబాబుకు ఓటు వేయడం అంటే స్కీమ్‌లు మొత్తం ఎత్తేసినట్లేనని, పేదలకు ఇళ్లు ఇస్తుంటే.. వీరికి కడుపుమండుతోందన్నారు. పొరపాటు జరిగితే పేదవాడు బతికే పరిస్థితి ఉండదని, టీడీపీ మాదిరిగా దోచుకోవడం.. పంచుకోవడం తాను చేయడం లేదని అన్నారు జగన్.

Jyothi

Jyothi

Next Story