చంద్రబాబు సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు

చంద్రబాబు సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు
x
Highlights

ఏపీలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు సన్నిహితులు నలుగురి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

ఏపీలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు సన్నిహితులు.. నలుగురి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. డీఎన్‌సీ ఇన్ఫ్రా నరేష్‌ చౌదరి, లోకేష్‌ సన్నిహితుడు కిలారి రాజేష్‌, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లపై సోదాలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్‌ పోలీస‌ుల సహాయంతో ఢిల్లీ యూనిట్‌ ఐటీశాఖ తనిఖీలు చేపట్టింది. అయితే ఎన్నికల సమయంలో ఈ నలుగురు నగదు పంపిణీ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2019 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు పీఏగా శ్రీనివాస్ పని చేశారు. ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారనే వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలీసు బందోబస్తు నడుమ ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 వరకు సుదీర్ఘకాలం చంద్రబాబు దగ్గర పీఏగా పని చేశారు శ్రీనివాస్. ప్రస్తుతం జీఏడీలో శ్రీనివాస్ ఉద్యోగిగా విధులు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories