Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Jun 2024 9:20 AM IST
Interesting comments of CM Chandrababu
X

Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు 

Chandrababu Naidu: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిందని కదా.. అని అధికారంతో కక్ష సాధింపులకు పాల్పడొద్దని చంద్రబాబు సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయవద్దంటూ సూచించారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించొద్దన్నారు. మంత్రలు, ఎమ్మెల్యేలు అహంకారానికి దూరంగా బాధ్యతతో, చిత్త శుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పని చేద్దామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని.. ముఖ్య నేతలు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story