Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

Tirumala: శ్రీ రామనవమి నాడు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది

Shashank Gullapelli
Published on: 17 April 2024 2:45 PM IST
Indian Badminton Player PV Sindhu Visited Tirumala
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

Tirumala: తిరుమల శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఉదయం విఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సింధుకు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. రామ నవమి నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న పీవీ సింధు.. మలేసియా, ఇండోనేషియా టోర్నమెంట్లతో పాటు ఒలింపిక్స్‌కి కూడా సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story