Vijayawada: బుడమేరు వాగు గండ్ల పూడ్చివేతకు రంగంలోకి ఇండియన్ ఆర్మీ

విజయవాడ సింగ్‌నగర్‌ను ముంపునకు కారణమైన బుడమేరు గండ్లను పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Sept 2024 11:22 AM IST
Indian Army has Swiftly Mobilised its Engineer Task Force to Vijayawada
X

Vijayawada: బుడమేరు వాగు గండ్ల పూడ్చివేతకు రంగంలోకి ఇండియన్ ఆర్మీ

Indian Army: విజయవాడకు వరద ప్రవాహం కొనసాగుతుంది. కాలనీల్లో నిన్న తగ్గినట్టే తగ్గిన వరద, మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కాలనీలోని ఇళ్లన్నీ జలమయంగా మారిపోయాయి. ఓ వైపు బుడమేరు మూడో గండిని అధికారులు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాలనీలో చేరిన వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

విజయవాడ సింగ్‌నగర్‌ను ముంపునకు కారణమైన బుడమేరు గండ్లను పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చి, మూడో గండి పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇటు బుడమేరు వాగు గండ్ల పూడ్చివేతకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 40 మంది ఇంజినీరింగ్ బృందాలతో ఆర్మీ బయల్దేరింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి ఆర్మీ బయలుదేరింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story