AP Rains: యూటర్న్ తీసుకున్న అల్పపీడనం..కోస్తా జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Dec 2024 6:32 AM IST
Big alert for AP Heavy rains in these districts today and tomorrow
X

AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్..నేడు,రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు భారీ వర్ష ముప్పు పొంచి ఉన్నట్లు భారతవాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడన పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీనపడుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని, చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రంలో గరిష్టంగా గంటకు 55కిలోమీటగర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు మత్స్య కారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కళింగ పట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, క్రిష్ణపట్నం సహా తమిళనాడులోని పలు పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story