ఏపీలో పెరుగుతున్న అక్రమ మద్యం కేసులు.. ధరల పెరుగుదలే ప్రధాన కారణం!

ఏపీలో పెరుగుతున్న అక్రమ మద్యం కేసులు.. ధరల పెరుగుదలే ప్రధాన కారణం!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారుతోంది... ఒక పక్క ఒడిశా, మరో పక్క తెలంగాణా రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారుతోంది... ఒక పక్క ఒడిశా, మరో పక్క తెలంగాణా రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి వారిపై అక్కడక్కడా కేసులు నమోదు చేస్తున్నా అధిక శాతం పక్కదారి పఢుతోంది. దీనికి ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం గా చెప్పవచ్చు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్య నియంత్రణలో భాగంగా షాపులను తగ్గించడమే కాకుండా వీటి ధరలను 25శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం అప్పటికే కొంతమేర అమ్మకాలపై పడింది. ఇటీవల కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం అన్నింటితో పాటు వైన్ షాపులను మూసివేశారు. దాంతో మద్యం ప్రియులు పిచ్చి పట్టినట్టుగా అయిపోయారు.

ఇక కేంద్రం ఈ నెల 4 నుంచి మద్యం షాపులకు సడలింపు ఇవ్వడంతో ఏపీలో నిత్యావసర దుకాణాలతో పాటు వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చారు. అయితే మొదటి రోజు మరో 25 శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు జనాలంతా వైన్ షాపుల ముందు బారులు తీరారు. ఆ ఒక్కరోజే ఏపీలో సుమారుగా రూ. 60కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. అయితే మరుసటి రోజే మరో 75 శాతం ధరలను పెంచి, వెంటనే అమల్లోకి తెచ్చింది. దీంతో పాటు మరో దఫా 13 శాతం మద్యం షాపులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి రోజు 25 శాతం ధరలు పెంచినా అధికంగా అమ్మకాలు జరిగాయి. రెండో రోజు మరో 75 శాతం ధరలు పెంచడంతో ఒకేసారి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి ప్రధాన కారణం ధరలు పెరగడమే.

నాలుగో విడత లాక్ డౌన్ కొనసాగింపు నేపథ్యంలో మే 17 నుంచి తెలంగాణాలో మద్యం షాపులను అధికారికంగా అమ్మకాలు ప్రారంభించారు. అయితే ఇక్కడ ప్రభుత్వం చీప్ లిక్కర్ పై రూ. 10, మిగిలిన అన్ని బ్రాండ్లపై 19 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పోలిస్తే ఏపీలో 80శాతానికి మించి ధరలు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మందుబాబులకు తక్కవ ధరకు మద్యం అమ్మేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక ఏపీకి మధ్యలో ఉన్న ప్రాంతాల్లో అయితే ఏకంగా నాటుసారా తయారు చేసి, అమ్మకాలు చేసేందుకు తెరతీశారు. ఈ విధంగా కొంతమంది సొమ్ము చేసుకునేందుకు ప్రణాళికలు చేశారు. తెలంగాణా, ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని కొంతమంది వ్యక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఏపీలో అమ్మకం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తెలంగాణా సరిహద్దు ప్రాంతాలైన విజయవాడ వంటి పలు ప్రాంతాలతో పాటు పాడేరు సమీపంలో ముంచింగుపుట్టు, ఇచ్చాపురం వంటి ప్రాంతాల నుంచి ఏపీకి మద్యం తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పాడేరు, ఇచ్ఛాపురంతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విధంగా ఏపీలో వందల్లో ఈ కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఏపీ, తెలంగాణా సరిహద్దులో ఉన్న జగ్గయ్యపేట వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి, ఎనిమిది బైకులు, 100 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఇలా అనేక రకాలుగా పక్కరాష్ట్రాల మద్యం ఎపీలోకి ప్రవహిస్తోంది. వారిపై అబ్కారీ శాఖ, పోలీసులు డేగ కన్ను వేసినప్పటికీ ఎక్కడా అక్రమ వ్యాపారులు తగ్గడం లేదు. అయినా, అధికారులు ఎక్కడికక్కడ వీరి భరతం పట్టడానికి సిద్ధం అవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories