Krishna District: పేద మహిళకు డబ్బులు ఆశజూపి.. కిడ్నీ మార్పిడికి యత్నం..

Krishna District: కిడ్నీ మార్పిడికోసం దరఖాస్తులో తప్పుడు సమాచారం

Shekhar G
Published on: 29 July 2023 9:09 AM IST
Illegal Kidney Transplant Case Filed In Krishna District
X

Krishna District: పేద మహిళకు డబ్బులు ఆశజూపి.. కిడ్నీ మార్పిడికి యత్నం

Krishna District: కృష్ణా జిల్లాలో కిడ్నీ దందా వెలుగు చూసింది. కిడ్నీ మార్పిడి కోసం అధికారులకు అందిన దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు పొందుపరచినట్లు విచారణలో వెల్లడైంది. పేద మహిళకు డబ్బులు ఆశజూపి మధ్యవర్తితో కిడ్నీ మార్పిడికి యత్నించినట్లు సమాచారం. కిడ్నీకోసం బేరసారాలు జరిగాయని విజయవాడ వెస్ట్ తహసిల్ధార్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు. తహసిల్ధార్ కార్యాయలంలో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, విచారణ చేపట్టడంతో ఆధార్ కార్డు, పాన్ కార్డుల వివరాలను తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించారు. కిడ్నీ మార్పిడికోసం దరఖాస్తులో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు అధికారు విచారణలో తేలడంతో దరఖాస్తు దారులకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. సొంత బంధువులని తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేసుకున్నాట్లు వెల్లడైంది. అధికారుల విచారణలో ఫేక్ దరఖాస్తులని నిర్ధారణ కొచ్చారు. కిడ్నీ దందాపై అధికారులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story