Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 28 గంటల సమయం

Tirumala: అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి 4 కిలోమీటర్ల మేర క్యూలైన్

Jyothi
Updated on: 28 May 2023 7:00 PM IST
Huge Devotees Rush At Tirumala
X

Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 28 గంటల సమయం

Tirumala: సప్తగిరుల్లో‌ భక్తుల రద్దీ‌ కొనసాగుతుంది. వేసవి‌ సెలవులు, వారాంతం కావడంతో‌ వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. అలిపిరి‌ నడక మార్గం, శ్రీవారి‌ మెట్టు మార్గం గుండా అధిక సంఖ్యలో భక్తులు నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠం‌ క్యూ కాంప్లెక్స్ మొదలుకుని నారాయణగిరి ఉద్యానవనం‌ నిండి శిలతోరణం మీదుగా, ఆర్టోపస్ బిల్డింగ్ వరకు దాదాపు నాలుగు కిలో‌మీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు.

దీంతో టైం స్లాట్ టోకెన్లు‌ లేని సర్వదర్శనానికి దాదాపు 28‌ గంటలకు‌ పైగా పడుతోంది.. ఐతే రద్దీ దృష్ట్యా అప్రమత్తమైన టీటీడీ అధికారులు‌ క్యూ లైన్స్ లో వేచి‌ ఉన్న భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు, పాలు, నిరంతరాయంగా ‌అందిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story