లబ్ధిదారులకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు: ఎమ్మెల్యే చిట్టిబాబు

మండలంలోని వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

S. Srikanth
Published on: 2 March 2020 6:27 PM IST
లబ్ధిదారులకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు: ఎమ్మెల్యే చిట్టిబాబు
X
ఎమ్మెల్యే చిట్టిబాబు

పి.గన్నవరం: మండలంలోని వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... నవరత్నల పథకంలో భాగంగా ఉగాది నాటికి 25 లక్షల లబ్ధిదారులకు అందచేసే విధంగా అప్పటి ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఎవ్వడం జరిగిందన్నారు.

ప్రతి పేదవాడికి ఇల్లు ఎవ్వలనే సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో అన్ని పక్షాల ప్రజలను కలుపుకుని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కావలసిన భూమిని కనుగోలు చేసి లబ్ధిదారులకు ఉగాది నాటికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు.


S. Srikanth

S. Srikanth

Next Story