7 గంటలుగా కొనసాగుతున్న జేసీ దివాకర్‌రెడ్డి విచారణ

admin1
Updated on: 4 Jan 2020 7:13 PM IST
7 గంటలుగా కొనసాగుతున్న జేసీ దివాకర్‌రెడ్డి విచారణ
X
jc diwakar reddy File Photo

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఈ ఉదయం అనంతపురం కోర్టురోడ్డులోని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు 7 గంటలుగా విచారిస్తున్నారు. ఈ సందర్భంగా.. స్టేషన్‌ గేటును వేసిన పోలీసులు.. మీడియాను, జేసీ అనుచరులను లోనికి అనుమతించడం లేదు. జేసీని పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధిని కూడా గేటు బయటే అడ్డుకున్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఉన్న సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక తమ బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామంటూ చెప్పుకొచ్చారు. దీనిపై కేసు నమోదు కాగా.. కోర్టురోడ్డులోని పోలీస్‌స్టేషన్‌లో.. జేసీని విచారిస్తున్నారు.


admin1

admin1

Next Story