మేము సరఫరా చేసింది రూ. 1.49 కోట్లు మాత్రమే : ప్రకటించిన హెరిటేజ్ సంస్థ

admin1
Updated on: 12 Jun 2020 11:21 AM IST
మేము సరఫరా చేసింది రూ. 1.49 కోట్లు మాత్రమే : ప్రకటించిన హెరిటేజ్ సంస్థ
X

గత ప్రభుత్వ హాయాంలో పలు కార్యక్రమాల అమలులో అవినీతికి పాల్పడిదంటూ ఏపీ సీఎం నియమించిన సబ్ కమిటీ విచారణ చేసి, ప్రాధమిక సమాచారాన్ని గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఉంచింది. అయితే దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా హెరిటేజ్ సంస్థ నుంచి మజ్జిగ ప్యాకెట్లు విఛ్చలవిడిగా కొనుగోలు చేశారన్న ఆరోపణపై సదరు సంస్థ స్పందించింది. తమ వద్ద పారదర్శకంగానే ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ దానికి సంబందించిన వివరాలను మీడియాకు విడుదల చేసింది.

టీడీపీ హయాంలో వేసవి కాలంలో వచ్చిన పలు పండుగల సందర్భంగా భక్తుల కోసం మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్యాకెట్ల సరఫరాపై ప్రస్తుతం పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 2015-16 నుంచి 2019-20 వరకు దేవాలయ్యాల్లో హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశామని తెలిపారు. వీటి విలువ రూ. 1.49 కోట్లు మాత్రమేనని ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్‌ ద్వారా ఏడాదికి రూ.40.0 కోట్ల విలువగల మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేశారన్నది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ పిలిచిన టెండర్ల ప్రకారమే.. తాము ముందుకు వెళ్లామని.. బ్రహ్మోత్సవం, శ్రీ రామనవమి, వైకుంఠ ఏకాదశి లాంటి పండుగలకు మాత్రమే మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశామని హెరిటేజ్ ఫుడ్స్‌ ప్రకటించింది. హెరిటేజ్ ఫుడ్స్‌ పారదర్శకంగా, విలువలతో కూడిన వ్యాపారం చేస్తుందని సంస్థ తెలిపింది.

admin1

admin1

Next Story