Weather Updates: ఏపీ అంతటా భారీ వర్షాలు

Weather Updates: ఏపీ అంతటా భారీ వర్షాలు
x
Highlights

ఏపీలో రుతువపనాలు విస్తరించడంతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని ఈ...

ఏపీలో రుతువపనాలు విస్తరించడంతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని ఈ ప్రబావం వల్ల నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫ్రకాశం జిల్లాలో ఒక చోట రైల్వే వంతెన కొట్టుకుపోగా, గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.

ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీనికి తోడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ డంతో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర‌మంత‌టా దాదాపుగా చుట్టేశాయి. ఈ ప్రభావంతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు జిల్లాలోని వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం వద్ద రాత్రి కురిసిన వర్షానికి రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్న‌ది. వరద నీరు పొంగి పొర్లడంతో రైలు పట్టాలు కూడా కనిపించకుండా పోయాయి. వరదనీరు రైల్వే ట్రాక్‌ పై నుంచి ప్రవహించింది. ప్ర‌స్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు-గుంతకల్లు మధ్య నడిచే సరకు రవాణా రైళ్లకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరోవైపు భారీ వర్షాలకు కంభం-సోమిదేవిపల్లి మార్గమధ్యలో రైల్వే స్తంబాలు కూలిపోయాయి. గుంటూరు జిల్లాలో కురిసిన 49.75 మిల్లీ మీట‌ర్ల వ‌ర్షం కార‌ణంగా గుంటూరు-గుంతకల్లు రైల్వే లైనులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైలు పట్టాలపై వర్షపు నీరు పొంగి ప్రవహిస్తోంది. పలుచోట్ల రైల్వే లైన్లు కోతకు గురయ్యాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు.

ఇదిలా ఉంటే, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం, బంగాళాఖాతంలో అల్పపీడ నం ఏర్పడడంతో అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, ఆ తర్వాత బలపడనుందని వాతావరణశాఖ అధికారులు తెలి పారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తా. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ తెలిపారు. దీనితో పాటు కోస్తా, ఉత్తరాంధ్ర రాయల సీమ కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు, వ్యవ సాయ కూలీలు, పశు, గొర్రెల కాపరు లు చెట్లు, చెరువు నీటి కుంటల వద్ద ఉండరాదని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కమిషనర్‌ కోరారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories