Water Issue: ప్రాజెక్టుల దగ్గర కొనసాగుతున్న పహారా

Water Issue: కృష్ణానదిపై ఉన్న జలాశయాల దగ్గర భారీగా పోలీసు బలగాలు

Sandeep Eggoju
Updated on: 3 July 2021 10:38 AM IST
Heavy Police Forces Near Reservoirs on the Krishna River
X

కృష్ణ నది వద్ద పోలీస్ బలగాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Water Issue: కృష్ణా నదిపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల దగ్గర పోలీసు పహారా కొనసాగుతోంది. పులిచింతల, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల దగ్గర ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుంటూరు, నల్గొండ జిల్లాల ఎస్పీలు, సాగునీటి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

సాగర్‌ ప్రధాన జల విద్యుత్‌ కేంద్రానికి వెళ్లే మార్గంలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుపై నుంచి వాహన రాకపోకలు కొనసాగుతుండగా.., ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మరోవైపు గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు, ఎగువ జల విద్యుత్‌ కేంద్రం దగ్గర బందోబస్తు కొనసాగుతుంది. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టు పోలీసు పహారాలోనే ఉంది. ఇక మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ఆత్మకూర్‌, అమరచింత, మక్తల్‌తోపాటు దేవరకద్ర, మరికల్‌ తదితర ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story