విజయవాడ భవానీ కథ సుఖాంతం

-12ఏళ్ల క్రితం తప్పిపోయిన భవానీ -ఫేస్ బుక్ ద్వారా కన్నతల్లి వద్దకు భవానీ

admin1
Published on: 8 Dec 2019 5:48 PM IST
విజయవాడ భవానీ కథ సుఖాంతం
X
Bhavani

చిన్నతనంలో తప్పిపోయిన భవానీ కథ సుఖాంతమైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జన్మించిన భవానీ పన్నెండేళ్ల క్రితం తప్పిపోయింది. ఫేస్ బుక్ ద్వారా కన్న తల్లి వద్దకు భవానీ చేరింది. విజయవాడలో మీడియా , పోలీసుల సమక్షంలో భవానీని కన్న తల్లికి పెంచిన తల్లిదండ్రులు అప్పగించారు.

ఇన్నేళ్ల తర్వాత తప్పిపోయిన కూతురు తమ చెంతకు చేరడంపై భవానీ కన్న తల్లి సంతోషం వ్యక్తంచేసింది. పెంచిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపింది. అమ్మాయి రోజులు తమ వద్ద ..మరో పది రోజులు పెంచిన తల్లిదండ్రులు ఉంటానని చెబుతోందని... అందుకు తాము సమ్మతమేనని తెలిపారు. ఇన్నేళ్లు భవానీనీ పెంచామని... ఇప్పడు కన్న తల్లి వద్దకు వెళ్లడం బాధగా ఉందని పెంచిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పెంచిన, కన్న తల్లిదండ్రులు కావాలని భవానీ అంటోంది.

admin1

admin1

Next Story