విశాఖగ్యాస్ లీకేజ్: ఈ ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి..జీవీఎంసీ

K V D Varma
Updated on: 7 May 2020 1:16 PM IST
విశాఖగ్యాస్ లీకేజ్: ఈ ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి..జీవీఎంసీ
X
gvmc released gas effected areas map

విశాఖపట్నం ఎల్జీ పలిమర్స్ నుంచి గ్యాస్ లీకైన ఘటన భయానక పరిస్థితులు సృష్టించింది. జనం పిట్టల్లా ఎక్కడికక్కడ రోడ్లమీద అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినా దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇవి చూస్తుంటే అక్కడి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ ఏఏ ప్రాంతాల్లో గ్యాస్ ప్రభావం ఉంది అనే విషయాన్ని సూచిస్తూ ఒక మ్యాప్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. దాని ప్రకారం జీవీఎంసీ 69 వ వార్డ్ లో పరిష్తితి క్లిష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా 66, 68 వార్డుల్లోనూ ఈ గ్యాస్ ప్రభావం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక 57, 76, 72 వార్డుల్లో చాలా భాగం గ్యాస్ ప్రభావంలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది.

ఈ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉండడం మంచిదనీ, ఇంట్లో కూడా మాస్క్ లు లేదా తడి బట్టను ధరించాలనీ జీవీఎంసీ సూచిస్తోంది.affected




K V D Varma

K V D Varma

Next Story