గుట్కా సీజ్ : ఏపీ అంతటా దాడులు

గుట్కా సీజ్ : ఏపీ అంతటా దాడులు
x
Highlights

కరోనా సమయంలో లాక్ డౌన్ ఉన్న సమయంలో సైతం నిషేదిత గుట్కా వ్యాపారం యధేశ్చగా సాగేది. వీటిని ఇతర రాష్ట్రాల నుంచి దొంగతనంగా రప్పించి, దాదాపుగా పదిరెట్లు...

కరోనా సమయంలో లాక్ డౌన్ ఉన్న సమయంలో సైతం నిషేదిత గుట్కా వ్యాపారం యధేశ్చగా సాగేది. వీటిని ఇతర రాష్ట్రాల నుంచి దొంగతనంగా రప్పించి, దాదాపుగా పదిరెట్లు అధిక ధరకు అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీసు అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. విశాఖ, తుని పరిసర ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించి కోట్ల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు తాజాగా గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ల వద్ద ఎగుమతి అవుతున్న గుట్కాను పట్టుకుని సీజ్ చేశారు.

లాక్‌డౌన్‌ కాలంలో ఏపీలో నిషేధిత గుట్కా వ్యాపారం జోరందుకుంటుంది. ఇప్పటికే గత నెలలో పెద్ద ఎత్తున విశాఖ పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున గుట్కా, పాన్ మసాలాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో కూడా నిషేధిత గుట్కాను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నాడు రాత్రి సమయంలో నిషేధిత గుట్కా లోడ్‌తో గుల్బర్గా నుంచి నెల్లూరు వెళ్తున్న లారీని పిడుగు రాళ్లలో పట్టుకున్నారు. లారీని తనిఖీ చేయగా అందులో రూ.30 లక్షల విలువగల గుట్కా బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే గుట్కా ప్యాకెట్లతో పాటు లారీని కూడా పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories