గుంటూరు మిర్చి యార్డు ఆరు వరకు క్లోజ్

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి పెరగడంతో మిర్చి యార్డును ఈ నెల 6వ తేదీ వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

Samba Siva Rao
Published on: 2 Jun 2020 7:00 PM IST
గుంటూరు మిర్చి యార్డు ఆరు వరకు క్లోజ్
X

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి పెరగడంతో మిర్చి యార్డును ఈ నెల 6వ తేదీ వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోనే అతిపెద్దాయిన గుంటూరు యార్డు ద‌గ్గ‌ర్లోని రెండు రోజులుగా మార్కెట్​ వ్యాపారులు ఉండటంతో ముందు జాగ్రత్త చ‌ర్య‌ల్లో భాగంగా యార్డును మూసివేయాలని నిర్ణయించారు.

కోవిడ్-19 కేసులు పెరుగుతూ..ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే రెండు నెలలకు పైగా యార్డును క్లోజ్ చేశారు.

అయితే లాక్ డౌన్ సడలింపుల్లో వారం రోజుల క్రితమే యార్డులో తిరిగి కార్యకలాపాలు స్టార్ట‌య్యాయి. కూలీలు, కమిషన్ ఏజెంట్లు …రోజు తర్వాత రోజు వచ్చే ప‌ద్ద‌తిలో యార్డులో కార్యకలాపాలు జరుగుతున్నాయి. రెండు రోజులుగా గుంటూరు సిటీలో నమోదైన కేసుల్లో అత్యధిక కోవిడ్ కేసులు యార్డు ద‌గ్గ‌ర్లోని మార్కెట్​ వ్యాపారులు ఉండటంతో ముందు జాగ్రత్త చ‌ర్య‌ల్లో భాగంగా యార్డును క్లోజ్ చెయ్యాల‌ని నిర్ణయించారు. మంగళవారం వచ్చిన సరకును మాత్రమే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మిర్చి యార్డు మూతపడనుంది. పరిస్థితులు కుద‌ట‌ప‌డ్డ‌ తర్వాత యార్డు తెరవడంపై నిర్ణయం తీసుకోనున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story