Gummanuru Jayaram: వైసీపీకి మరో షాక్‌.. మంత్రి గుమ్మనూరు రాజీనామా

Gummanuru Jayaram: వైసీపీకి(YSRCP)కు మరో షాక్‌ తగిలింది.

Shekhar G
Updated on: 5 March 2024 2:02 PM IST
Gummanuru Jayaram Resigns To Ysrcp And Ministry In Andhra Pradesh
X

Gummanuru Jayaram: వైసీపీకి మరో షాక్‌.. మంత్రి గుమ్మనూరు రాజీనామా

Gummanuru Jayaram: వైసీపీకి మరో షాక్ తగలింది. వైసీపీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. వైసీపీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ విధానాలతో విసుగు చెందానని చెప్పారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ అడిగారని అన్నారు. తనకు అది ఇష్టం లేదన్నారు. తాను గుంతకల్లు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. జగన్‌ గుడిలో విగ్రహంలా తయారయ్యారని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story