Nellore: ఎన్ పీఆర్ పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది: మంత్రి అనిల్ కుమార్

Nellore: ఎన్ పీఆర్ పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది: మంత్రి అనిల్ కుమార్
x
Anil kumar yadav
Highlights

ఎన్ పీఆర్ పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు.

నెల్లూరు: ఎన్ పీఆర్ పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారుఎన్ పీఆర్ పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఎన్ పీఆర్ పై టీడీపి ఇంతవరకూ తమ వైఖరిని చెప్పకనే అధికార పక్షంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపి నేతలపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్ తరహాలో ఎన్ పీఆర్ పై కేంద్రం తమ విధానాన్ని చెప్పేవరకు ఇక్కడ అమలు చేయబోమని మంత్రి అన్నారు.

ఇప్పటికే ఈ అంశంపై తమనేత జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారని.. 28 న క్యాబినెట్ లో తీర్మానం చేశామని, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని... ఆయన చెప్పారు.. ఇంత క్లారిటీ గా ప్రభుత్వం చెబుతుంటే టిడిపి ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ...రాజధాని గ్రామాలకే పరిమితమైందన్నారు. ఎన్ పీఆర్ పై టీడీపీ ఇంతవరకు స్పష్టత ఇవ్వకుండా ఉంటే కొందరు నాయకులు మైనారిటీ లను రెచ్చగొడుతూ...ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. ఇంత జరిగినా మైనారిటీ లు కొందరు ఇంకా ఆ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారన్నారు. వెంటనే ఆ పార్టీని వీడాలని మంత్రి కోరారు.



Show Full Article
Print Article
Next Story
More Stories