పథకాల ప్రకటనలే తప్ప.. అమలులో విఫలం: గోరంట్ల బుచ్చయ్య

S. Srikanth
Published on: 22 Feb 2020 7:11 PM IST
పథకాల ప్రకటనలే తప్ప.. అమలులో విఫలం: గోరంట్ల బుచ్చయ్య
X

రాజమండ్రి: రాజమండ్రి శనివారం స్థానిక ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్నిరూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. వి.టి కాలేజ్ రోడ్ లోని గోగులమ్మ గుడి వద్ద నుండి పాదయాత్రగా ప్రారంభమై గోరంట్ల ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ అవ్వను పలకరించిన ఏ తాతను పలకరించిన చంద్రబాబు హయాంలో మాకు ఇచ్చి పింఛన్ ను ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కుంటు పడిందని, ముఖ్యమంత్రి పథకాల ప్రకటనలు విడుదల చేయడం తప్ప అవి ప్రజలకు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ బూర దుర్గరావు, కోప్పిశెట్టి చిన్ని,గంగిన హనుమంతరావు,కాశీ నవీన్ కుమార్,మజ్జి పద్మావతి, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story