లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన

లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన
x
న్యాయమూర్తి. సి.హరిత, సభ్యులు కె. ధర్మప్రసాద్ న్యాయమూర్తులు లక్ష్మయ్య ఎల్.గణపతి
Highlights

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా శనివారం సూళ్ళూరు పేట కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కోర్టు ఆవరణలో 63 కేసులను పరిష్కరించినట్టు న్యాయమూర్తి. సి.హరిత వెల్లడించారు.

సూళ్ళూరు పేట: జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా శనివారం సూళ్ళూరు పేట కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కోర్టు ఆవరణలో 63 కేసులను పరిష్కరించినట్టు న్యాయమూర్తి. సి.హరిత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని, సూళ్ళూరుపేట నియోజవర్గంలో చుట్టు పక్క గ్రామాలకు చెందిన కక్షిదారులు అధికసంఖ్యలో హాజరై వారి కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేసుకున్నారని, ఆమె వివరించారు. కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

లోక్ అదాలత్ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, ఇందులో సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, క్రిమినల్ కేసులు, వినియోగదారుల కేసులు, ఇతర కేసులకు సంబంధించి జాతీయ లోక్‌అదాలత్ ద్వారా పరిష్కార మార్గం చూపించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కె. ధర్మప్రసాద్ న్యాయమూర్తులు లక్ష్మయ్య ఎల్.గణపతి, ఈ. జ్యోతి ప్రకాష్ రెడ్డి, శ్రీరాములు యాదవ్ తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories