చంద్రబాబు కపట బుద్దితో, పవన్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

చంద్రబాబునాయుడు కపట బుద్దితో, పవన్ కళ్యాణ్ అజ్ఞానంతో ఉన్నారని ఏపి అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విమర్శించారు.

S. Srikanth
Published on: 4 Jan 2020 10:21 AM IST
చంద్రబాబు కపట బుద్దితో, పవన్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
X

పాయకరావుపేట: చంద్రబాబునాయుడు కపట బుద్దితో, పవన్ కళ్యాణ్ అజ్ఞానంతో ఉన్నారని ఏపి అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విమర్శించారు. పట్టణంలో సచివాలయ భవన శంఖుస్థాపన చేసిన అనంతరం ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. సీపీఎం, సీపీఐ సహా మిగతా రాజకీయ పార్టీలన్నీ తమ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు.

అణగారిన వర్గాల, పేద ప్రజల అభివృద్దికి ఆరు నెలల కాలంలో ప్రవేశపేట్టి, అమలు చేస్తున్న చారిత్రాత్మక, సాహసోపేతిమైన సంక్షేమ పధకాలు చంద్రబాబు, పవన్ ల కంటికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ, మహిళలకు కలిపి 50 శాతం రీజర్వేషన్లు కల్పించిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు. కంటి ఎదురుగా, ఇంటి ముందు పాలనకై విశాఖను పరిపాలనా రాజధాని చేసి, అభివృధ్ధి వికేంద్రీకరణకు పూనుకున్న జగన్ పై రాజకీయ లబ్ది కోసమే విమర్శలు చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story