Ganta Srinivasa Rao Follower Passed away: గంటా అనుచ‌రుడు న‌లంద కిషోర్ మృతి

Ganta Srinivasa Rao Follower Passed away: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా అనుచరుడు నలంద కిషోర్ మృతిచెందారు. ఆయ‌న వ‌య‌స్సు సుమారుగా 65 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నలంద కిషోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు

Raj
By Raj
Published on: 25 July 2020 11:51 AM IST
Ganta Srinivasa Rao Follower Passed away: గంటా అనుచ‌రుడు న‌లంద కిషోర్ మృతి
X
Ganta Srinivasa Rao Follower Nalanda Kishore death with heart attack

Ganta Srinivasa Rao Follower Passed away: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా అనుచరుడు నలంద కిషోర్ మృతిచెందారు. ఆయ‌న వ‌య‌స్సు సుమారుగా 65 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నలంద కిషోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న కిషోర్ కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.. అయితే అయన అక్కడ మరణించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిపై అసభ్యకర పోస్టుల వాట్సాప్ లో షేర్ చేశారని.. నెల క్రితం ఆయన్ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. కిషోర్‌తో పాటూ కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అరెస్ట్ చేశారు.

ఆ సమయంలో వారిని కర్నూల్ కు తరలించారు. దీంతో టీడీపీ నేతలు కూడా ఆయన అరెస్ట్‌పై భగ్గుమన్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ సమయంలో ఆయనను అరెస్ట్ చేయడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. తర్వాత ఆయనకు బెయిల్ రావడంతో విడుదల చేశారు. నలంద కిశోర్ మృతి చెందారు. ... కిశోర్ మృతి పట్ల గంటా శ్రీనివాసరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు నలంద కిషోర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.

Raj

Raj

Next Story