AP Govt Issues Notice Giving Chambers : కొత్త మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

Arun Chilukuri
Published on: 24 July 2020 1:59 PM IST
AP Govt Issues Notice Giving Chambers : కొత్త మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
X

AP Govt Issues Notice Giving Chambers : కొత్త మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా బాద్యతలు తీసుకున్న సీదిరి అప్పలరాజుకు సచివాలయంలోని నాలుగో నెంబరు బ్లాక్ లో ఉన్న 132 గదిని కేటాయించింది ప్రభుత్వం. మాజీ మంత్రి మోపిదేవి ఛాంబర్ నే అప్పలరాజుకు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసింది.

వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కు రెండో నెంబరు బ్లాక్ లో 215 నెంబరు గది కేటాయింపు. గతంలో ఉపముఖ్యమంత్రి రెవన్యూ శాఖ మంత్రిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వినియోగించిన గదిని కేటాయిస్తూ ఆదేశాలు విడుదల చేసింది. రహదారులు భవనాల శాఖ మంత్రిగా తన పాత చాంబరునే వినియోగించనున్నారు మాలగుండ్ల శంకర నారాయణ. గతంలో రహదారులు భవనాల శాఖకు కేటాయించిన ఛాంబర్ లోనే ఉపముఖ్యమంత్రి రెవన్యూగా బాధ్యతలు నిర్వహించన్నారు ధర్మాన కృష్ణదాస్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story