Jayadev Galla: నేను రాజకీయాల్లో మూడేళ్ల నుంచి దూరంగా ఉంటున్నా

Jayadev Galla: రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోను

Jyothi
Published on: 28 Jan 2024 12:39 PM IST
Galla Jayadev Says Good Bye To Politics
X

Jayadev Galla: నేను రాజకీయాల్లో మూడేళ్ల నుంచి దూరంగా ఉంటున్నా

Jayadev Galla: తాను మూడేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, అలాగని తాను టీడీపీకి రాజీనామా చేయడం లేదని... కానీ లోకసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. చాలామందికి ఎంపీ బాధ్యతలు ఏంటో కూడా తెలియడం లేదన్నారాయన.. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.

చట్టాలు తయారు చేసే ప్రజాప్రతినిధులు పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగం, వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాల్లో ఉంటారని. తాను అలాగే వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు.. ఇప్పటివరకు తనకు సహకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, లోకేష్‌కు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గుంటూరు ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story