ఇండియన్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడంపై గల్లా జయదేవ్ ప్రశ్న

admin1
Published on: 21 Nov 2019 9:32 PM IST
Galla jayadev
X
Galla jayadev

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారత చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తప్పుబట్టారు. ఇండియన్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడం... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని... అది ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమానంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ హాజరైన సంగతి గల్లా జయదేవ్ గుర్తుచేశారు. ఇప్పటికైనా అమరావతి పేరు ఉండేలా ఇండియన్ మ్యాప్‌ను విడుదల చేయాలని గల్లా డిమాండ్ చేశారు.

admin1

admin1

Next Story