Nakkapalle: అడ్డంగా బుక్కయిన డొంకాడ పంచాయితీ సెక్రటరీ

మండలంలోని డొంకాడ పంచాయితీ సెక్రటరీ జి.రాజేష్ ఫోన్ కాల్స్ ఆడియో రికార్డులతో అడ్డంగా బుక్కయ్యారు.

admin1
Published on: 17 March 2020 12:26 PM IST
Nakkapalle: అడ్డంగా బుక్కయిన డొంకాడ పంచాయితీ సెక్రటరీ
X
G. Rajesh

నక్కపల్లి: మండలంలోని డొంకాడ పంచాయితీ సెక్రటరీ జి.రాజేష్ ఫోన్ కాల్స్ ఆడియో రికార్డులతో అడ్డంగా బుక్కయ్యారు. గ్రామానికి చెందిన ఎంపిటీసి అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు పంచాయితీ సెక్రటరీయే ప్రధాన కారకుడంటూ ప్రచారం వినిపించడంతో పాటు, ఆయన మాట్లాడిన ఫోన్ కాల్స్ వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డొంకాడ ఎంపిటీసిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి ప్రగడ అప్పారావు, ప్రగడ మాణిక్యంల ఇంటి పన్ను రశీదు పొందడానికి ప్రగడ అప్పారావుని, మాజీ సర్పంచి జగ్గారావులను విశాఖ రప్పించి, నగరమంతా అక్కడికీ, ఇక్కడీకీ అంటూ తిప్పి ముప్పుతిప్పలకు గురిచేసిన ఘనుడు. ఇంతా జరిగాక రశీదు ఇవ్వంద్దంటూ తనపై అధికార, రాజకీయపరమైన తీవ్ర ఒత్తిళ్ళు వస్తున్నాయంటూ కాలయాపన చేశాడు. ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీ నాయకులు, అధికారులు ఎంపిడీఓ, ఈ ఓఆర్డీ లు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఆ ఒత్తిడితో అనారోగ్యం బారిన పడ్డానని బావురుమన్నారు.

తాను ఉద్యోగం చేస్తున్న పంచాయితీరాజ్ వ్యవస్థే పెద్ద చెత్త వ్యవస్థ అంటూ తన సంభాషణలో వాపోయారు. స్వతంత్ర సంస్థ ఎలక్షన్ కమీషన్ లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎంపిడీఓ, ఈఓఆర్డీ లు ఈ విధంగా అధికారపార్టీకీ అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య బద్దంగా జరగవలసిన ఎన్నికలను అపహాస్యం చేయడమే అవుతుంది. ఇంటి పన్ను చెల్లించడానికి సెక్రటరీని సంప్రదించినప్పటికీ అందుకు తగ్గ రికార్డులు గత సెక్రటరీ వద్దనే ఉండిపోయాయంటూ కాలయాపన చేసి, ఎమ్మెల్యే , అధికారులు, వైసీపీ నాయకులు ఇంటి పన్ను రశీదు ఇవ్వరాదని ఒత్తిడి చేస్తున్నారంటూ చివరి నిమిషం లో సెక్రటరీ రాజేష్ చెప్పాడనీ ప్రగడ అప్పారావు, ప్రగడ మాణిక్యం తెలిపారు.

సెక్రటరీ మోసపూరితమైన చర్యల కారణంగానే మా నామినేషన్లు తిరస్కరించబడ్డాయని వారు మండిపడ్డారు. వైసీపీ నాయకులతో అధికారులు మిలాఖిత్ అయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ముందుగానే ఇంటి చెల్లించానని, దానిని పరిశీలించకుండానే పన్ను బకాయి ఉన్నట్లు సెక్రటరీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ప్రగడ మాణిక్యం ఆరోపించారు. ఆర్డీఓ కి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు, సెక్రటరీ వ్యవహరించిన తీరుపై హైకోర్టుని ఆశ్రయించనున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగకుండా, దౌర్జన్యంగా గెలవడానికి ప్రయత్నిస్తున్నారని, ఓటమికి భయపడే ఇటువంటి చర్యలకు దిగుతున్నారని ప్రగడ అప్పారావు పేర్కొన్నారు.

admin1

admin1

Next Story