రోటరీ ఉచిత వైద్య శిబిరం

రోటరీ ఉచిత వైద్య శిబిరం
x
Highlights

ఇన్స్పైర్ 2020 విద్యా వైజ్ఞానిక సదస్సు జరుగుతున్న ఫాదర్ బియాంకి ఉన్నత పాఠశాలలో గుడివాడ రోటరీ క్లబ్ ఉచిత వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు.

గుడివాడ: ఇన్స్పైర్ 2020 విద్యా వైజ్ఞానిక సదస్సు జరుగుతున్న ఫాదర్ బియాంకి ఉన్నత పాఠశాలలో గుడివాడ రోటరీ క్లబ్ ఉచిత వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. గుడివాడ ఉప విద్యాశాఖాధికారిణి ఎం.కమలకుమారి శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ ఇటువంటి సేవలు చేయడం ఎంతో ఉపయుక్తమని, వైజ్ఞానిక సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

రోటరీ క్లబ్ అధ్యక్షుడు వై.రెడ్డయ్య చౌదరి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి తన రక్తంలో ఉన్న షుగర్ స్థాయి, రక్తపోటు మరియు బీ.ఎం.ఐ లను తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో, రోటరీ క్లబ్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ .వై.రెడ్డయ్య చౌదరి,.బి.శంకర రావు,.ఎన్. వై.మాధవ్ కుమార్ పలువురు రొటేరియన్ లు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories