Gajuwaka: ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

S. Srikanth
Published on: 25 Jan 2020 7:56 PM IST
Gajuwaka: ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
X

గాజువాక: జీవీఎంసి 65 వ వార్డ్ బిసి రోడ్డు రాజీవ్ మార్గం శంకర్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్ నందు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో అందరికీ మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో హెచ్.పి.సి.ఎల్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహాయం సహకారంతో ఉచిత కంటి, సాధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని ప్రారంబిచారు.

ఈ సంధర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ... మానవ సేవయే మాధవ సేవ అనే సిద్దాంతాన్ని నమ్మి నిత్యం ప్రజల మధ్యనే ఉంటు వారి కష్ట సుఖాలలో పాలుపంచుకుంటూ నాయకుడిగా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఇలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల చేత ప్రజా నాయకుడు అని అనిపించుకున్న మన వైయస్సార్సీపి జిల్లా నాయకుడు దొడ్డి రమణకునా అభినందనలు అని అన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story