నూకాలమ్మ మాలాధారణ భక్తులకు ఉచితంగా వస్త్రాల పంపిణీ

నూకాలమ్మ మాలాధారణ భక్తులకు ఉచితంగా వస్త్రాల పంపిణీ
x
Highlights

భీమిలి ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి మహోత్సవాలు సందర్భంగా మాలాధారణ భక్తులకు ఉచితంగా వస్త్రాలు, మాలలు పంపిణీ చేశారు.

భీమిలి ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి మహోత్సవాలు సందర్భంగా మాలాధారణ భక్తులకు ఉచితంగా వస్త్రాలు, మాలలు పంపిణీ చేశారు.భీమిలి ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి మహోత్సవాలు సందర్భంగా మాలాధారణ భక్తులకు ఉచితంగా వస్త్రాలు, మాలలు పంపిణీ చేశారు.భీమిలి ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి మహోత్సవాలు సందర్భంగా మాలాధారణ భక్తులకు ఉచితంగా వస్త్రాలు, మాలలు పంపిణీ చేశారు.భీమిలి ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి మహోత్సవాలు సందర్భంగా మాలాధారణ భక్తులకు ఉచితంగా వస్త్రాలు, మాలలు పంపిణీ చేశారు.

మాన్సస్ ఇంజనీరింగ్ కళాశాల ఫౌండర్, ప్రొఫెసర్ జి.ఎల్.ఎన్. రాజు ఆర్ధిక సహాయంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ భీమిలి డివిజన్ అధ్యక్షులు, ఆలయ నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి గంటా నూకరాజు ముఖ్య అతిధిగా విచ్చేసి శ్రీ నూకాలమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తులకు బట్టలు, మాలలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంటా నూకరాజు మాట్లాడుతూ... 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ నూకాలమ్మ అమ్మవారు భీమిలి ప్రాంతంలో వెలసి ఈ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర నుండి వచ్చే భక్తులకు కూడా రక్షణగా ఉన్నారని అన్నారు. ఎన్ని హుద్ హుద్, సునామీ లాంటి భయంకరమైన విపత్తులు వచ్చినా... నేనున్నానంటూ అందరికి రక్షణ గోడలా ఉండి కాపాడుతున్న అమ్మ శ్రీ నూకాలమ్మ అని అన్నారు. ఇక్కడ ప్రజలు కూడా నిత్యం అమ్మవారిని కొలుస్తూ సేవలు పొందుతారని, కొత్త అమావాస్య వచ్చిందంటే శ్రీ నూకాలమ్మ భక్తుల కోలాహలం ఎనలేనిదని చెప్పారు.

ఇంత చక్కని దేవత మాలాధారణ ప్రవేశపెట్టడం మాలలు వేసే భక్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చి మాలలు వేయడం చాలా శుభపరిణామమని అన్నారు. మాలాధారణ ప్రవేశపెట్టి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి గతంలోలానే ఈ సంవత్సరం కూడా భక్తులకు బట్టలు, మాలలు ప్రధానం చేయడం శుభపరిణామమని... దీనివలన పేద భక్తులు కూడా మాలలు వెయ్యాలనే సంకల్పం ఉన్నప్పటికి వేసే ఆర్షిక స్థోమత లేనివారికి ఇది చాలావరకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సంవత్సరం మాలాధారణ బట్టలు విరాళంగా ఇచ్చిన ప్రొఫెసర్ జి.ఎల్.ఎన్. రాజుగారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories