Missing: గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు.. ఇవాళ ఇద్దరి మృతదేహాలు లభ్యం

Missing: తాళ్లరేవు సమీపంలో జరిగిన ఘటన

Shekhar G
Published on: 22 Oct 2023 9:54 AM IST
Four People Went Missing In the Godavari River In the Kakinada District
X

Missing: గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు.. ఇవాళ ఇద్దరి మృతదేహాలు లభ్యం 

Missing: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు దగ్గర గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. పశ్చిమగోదారి జిల్లా తణుకు గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు యానాంకి వచ్చారు. అక్కడి నుంచి తాళ్లరేవు సమీపంలోని గోపులంక దగ్గర గోదావరిలో స్నానానికి దిగారు. వీరిలో నలుగురు యువకులు గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక యంత్రాంగం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ఇవాళ ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story