33/11 కే.వి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రులు

33/11 కే.వి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రులు
x
మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్
Highlights

మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో, 33/11 కే.వి విద్యుత్ ఉపకేంద్ర శంకుస్థాపన చేసిన మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మర్రిపాడు: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో, 33/11 కే.వి విద్యుత్ ఉపకేంద్ర శంకుస్థాపన చేసిన మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...

మా స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి గ్రామంలో, విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, చుట్టుపక్కల 22 గ్రామాలకు 214 ట్రాన్స్ ఫార్మర్లతో రైతులకు ఎటువంటి ఆటంకం లేకుండా, విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబంతో మాకు ఉన్న అనుబంధం దృష్టిలో పెట్టుకుని, గత పాలకులు మా గ్రామాలపై వివక్షత చూపడం జరిగిందని తెలిపారు. అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు జిల్లా అంటే ముఖ్యమంత్రి వై.యస్ మోహన్ రెడ్డికి ప్రత్యేక అభిమానమని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories