Muthukur: కృష్ణపట్నం పోర్టులో 49 వ భద్రతా వారోత్సవాలు

మండలంలోని కృష్ణపట్నం పోర్టులో 49 వ జాతీయ భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కృష్ణపట్నం పోర్టు డైరెక్టర్ జిజే రావు పాల్గొన్నారు.

S. Srikanth
Published on: 4 March 2020 5:01 PM IST
Muthukur: కృష్ణపట్నం పోర్టులో 49 వ భద్రతా వారోత్సవాలు
X

ముత్తుకూరు: మండలంలోని కృష్ణపట్నం పోర్టులో 49 వ జాతీయ భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కృష్ణపట్నం పోర్టు డైరెక్టర్ జిజే రావు పాల్గొన్నారు. ముందుగా జాతీయ భద్రతా వారోత్సవాల జండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోర్టు భద్రత సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు వ్యక్తిగత భద్రత చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వ్యక్తిగత భద్రత పాటించినప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చన్నారు. భద్రత కంటే పని ముఖ్యమైనది కాదన్నారు. కృష్ణ పట్నం పోర్టులో భద్రత ఆరోగ్యం, పర్యవరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులు కార్మికుల చేత భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.

49 వ భద్రతా వారోత్సవాలు నేటి నుండి 10 వ తేదీ వరకు పోర్టులో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఓఓ సుబ్బారావు, జితేందర్, రాజేంద్రప్రసాద్ కెప్టన్ ప్రదీప్ గౌర్, గణేష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story