Punganur: విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం

S. Srikanth
Published on: 29 March 2020 9:33 PM IST
Punganur: విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం
X

పుంగనూరు: పట్టణ పరిధిలో కరోనా వైరస్ నివారణ భాగంగా పేద ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావడం అదేవిధంగా నిత్యము బిక్షాటన చేస్తూ బతుకుతున్న యాచకులకు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న వేళ కరోనా నివారణ వ్యాధి నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న మున్సిపల్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం గత వారం రోజులుగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

మొదటి రోజున అన్నదాన కార్యక్రమం చేపట్టి యాచకులకు పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు మున్సిపల్ సిబ్బందికి ఒకరోజు భోజన వసతితో పాటు మాస్కులు షానిటేజ్రేస్ హ్యాండ్ వాష్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు కరోనా వైరస్ వ్యాధి పట్ల వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించడం జరిగింది.


S. Srikanth

S. Srikanth

Next Story