YS Jagan: గుంటూర్ సబ్ జైలుకు వెళ్లిన మాజీ సీఎం జగన్‌

YS Jagan: మాజీఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Sept 2024 8:39 PM IST
YS Jagan
X

YS Jagan

YS Jagan: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరులో పర్యటించారు. వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్ జైలుకు చేరుకున్నారు. అక్కడ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ఇంత దుర్మార్గపు పాలన ఏపీలో ఎన్నడూ లేదని.. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు వైసీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story