రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సమారాధన

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సమారాధన
x
Highlights

రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వై.రెడ్డయ్య చౌదరి వృద్ధాశ్రమానికి రక్తపోటు కొలిచే సాధనాన్ని ఉచితంగా క్లబ్ కౌన్సిలర్ ఎన్.వి.రామకృష్ణ రావు చేతులమీదుగా బహూకరించారు.

గుడివాడ: ‌పూర్వ రొటేరియన్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తిరుమలశెట్టి సంజీవరావు పుట్టినరోజు, ధనుర్మాస సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజేంద్రనగర్ లో మమత వృద్ధాశ్రమంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వై.రెడ్డయ్య చౌదరి వృద్ధాశ్రమానికి రక్తపోటు కొలిచే సాధనాన్ని ఉచితంగా క్లబ్ కౌన్సిలర్ ఎన్.వి.రామకృష్ణ రావు చేతులమీదుగా బహూకరించారు.

క్లబ్ కౌన్సిలర్ ఎన్.వి.రామకృష్ణ రావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను చేయడానికి ముందుకు వచ్చిన టి.సంజీవరావును ఆయన అభినందించారు. అంతేకాకుండా గుడివాడ రోటరీ క్లబ్ అర్హులకు చేసే సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందుంటుందని తెలియజేశారు. అన్నదాన కర్త టి.సంజీవరావు మాట్లాడు తూ పెద్దలకు ఈ విధంగా సేవ చేయటం ఎంతో సంతోషం గా ఉందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియ జేశారు. ఆశ్రమవాసులు అన్నదాత టి.సంజీవరావుకు, రోటరీ క్లబ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వాధ్యక్షులు పి.చంద్రశేఖర రావు, తక్షణ పూర్వాధ్యక్షులు బి.శంకరరావు, కార్యదర్శి టి.ఎన్.రాజశేఖర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories