Pawan Kalyan:తాగునీటి సౌకర్యం లేని గ్రామాల పై ఫోకస్ పెట్టాలి

Pawan Kalyan: గత ప్రభుత్వం కేంద్ర నిధులు వాడుకోలేకపోయింది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Jun 2024 10:45 PM IST
Focus should be placed on villages without drinking water facilities Says Pawan Kalyan
X

Pawan Kalyan: తాగునీటి సౌకర్యం లేని గ్రామాల పై ఫోకస్ పెట్టాలి

Pawan Kalyan: తాగునీటిపై సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అతిసారం కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులు వాడుకోలేకపోయిందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం అమలు, నిధుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story