ఆంధ్రప్రదేశ్ లో మూడురోజుల్లో 106 పాజిటివ్ కేసులు.. తొలి కరోనా మరణం నమోదు!

ఆంధ్రప్రదేశ్ లో మూడురోజుల్లో 106 పాజిటివ్ కేసులు.. తొలి కరోనా మరణం నమోదు!
x
Highlights

దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నా మూడు రోజుల క్రితం వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో కట్టడిలోనే ఉంది. సోమవారం రాత్రివరకూ మొత్తం కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో 43 కేసులు...

దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నా మూడు రోజుల క్రితం వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో కట్టడిలోనే ఉంది. సోమవారం రాత్రివరకూ మొత్తం కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో 43 కేసులు మాత్రమె నమోదు అయ్యాయి. ఆ తరువాత పరిస్థితి మారిపోయింది. మంగళవారం నుంచి గురువారం రాత్రి వరకూ 106 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన ౨౪ గంటల్లో కొత్తగా 38 కేసులు నమోదు కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా (24) నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. ఇక కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదు కాలేదు. ఇక కరోనా వైరస్ కారణంగా తొలి మరణం నమోదైంది. విజయవాడకు చెందిన ఒక వ్యక్తీ కరోనా కారణంగా గురువారం మరణించారు. అతని కుమారుడు ఇటీవల ధిల్లీ లో జరిగన కార్యక్రమంలో పాల్గొని వచ్చారని అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తీ మరణాంతరం పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలిందని వారు తెలిపారు.

గురువారం ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఇలా..

- ఉదయం 10 వరకు మొత్తం 132 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 91 మంది దిల్లీలోని తబ్లీగీ జమాత్‌ సమావేశానికి హాజరైనవారు కాగా, 20 మంది వారికి సన్నిహితంగా

మెలిగినవారుగా గుర్తించారు.

- 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 123 నమూనాలు పరీక్షించగా, వాటిలో 11 పాజిటివ్‌ గా తేలాయి. వీటిలో మిగిలిన 112 నమూనాలు నెగెటివ్‌గా తేలాయి.

- సాయంత్రం 6 గంటల తర్వాత 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

- నెల్లూరులో గురువారం ఒక్కరోజే 21 కరోనా వైరస్ కేసులు నమోదు కావడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories