ఇవాళ విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడ్డ మంటలు

Vijayawada: క్రాకర్స్ అగ్నికి ఆహుతి.. సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్

Jyothi
Updated on: 23 Oct 2022 1:51 PM IST
Fire Breaks out in Vijayawada Gymkhana Grounds Today
X

ఇవాళ విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడ్డ మంటలు

Vijayawada: దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. క్రాకర్స్ స్టాల్స్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న రాత్రి తిరుపతిలో, ఇవాళ విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్రాకర్స్ షాపుల్లో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. స్టాల్స్‌లోని క్రాకర్స్ అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంతో భయంతో వ్యాపారులు , ప్రజలు పరుగులు తీసారు. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళన నెలకొంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు.

Jyothi

Jyothi

Next Story