శ్రీశైలంలో అగ్నిప్రమాదం.. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ షాపుల్లో మంటలు

Fire Accident: మంటల్లో దగ్ధమైన ఎల్ బ్లాక్‌లోని 12 దుకాణాలు

Jyothi
Published on: 31 Aug 2023 9:28 AM IST
Fire Breaks out in Lalithambika Shopping Complex shops in Srisailam
X

శ్రీశైలంలో అగ్నిప్రమాదం.. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ షాపుల్లో మంటలు 

Fire Accident: శ్రీశైలం ఆలయ సమీపంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. దుకాణాల సముదాయంలోని ఎల్ బ్లాక్‌లో సుమారు 12 దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్దమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ఇతర షాపులకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేవారు. అగ్నిప్రమాదంతో షాపు నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ‎ఇటీవలే షాపులను వేలంపాట ద్వారా దక్కించుకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాదస్థలాన్ని శ్రీశైలం ఈవో లవన్న పరిశీలించారు.

Jyothi

Jyothi

Next Story