Guntur: గుంటూరు జిల్లాలోని బోరుగడ్డ అనిల్‌ ఆఫీస్‌కు నిప్పు

Guntur: అర్ధరాత్రి కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు

Dhatripriya
Published on: 7 Feb 2023 7:42 AM IST
Fire At Borugadda Anil Office In Guntur
X

Guntur: గుంటూరు జిల్లాలోని బోరుగడ్డ అనిల్‌ ఆఫీస్‌కు నిప్పు

Borugadda Anil: గుంటూరు జిల్లా అరండల్ పేటలోని బోరుగడ్డ అనిల్ కుమార్ క్యాంపు కార్యాలయానికి అర్ధరాత్రి దుండగులు నిప్పుపెట్టారు. పార్టీ కార్యాలయంపై ఎవరూ లేని సమయంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించి తనపై దాడి చేసినట్టు అక్కడి వాచ్ మెన్ ఆరోపిస్తున్నాడు. క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌ ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై బొరుగడ్డ అనిల్ కుమార్ పలువురు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బొరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తు్న్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story