Fire Accident: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident: గోవిందరాజస్వామి రథం మండపానికి వ్యాపించిన మంటలు

Jyothi
Published on: 16 Jun 2023 12:54 PM IST
Fire Accident Near Tirupati Govindaraja Swamy Temple
X

Fire Accident: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident: తిరుపతిలో అగ్నిప్రమాదానికి గురైన భవనంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్న సమీప భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ప్రమాదం జరగడంతో ఆలయ మాడ వీధుల్లో రాకపోకలను నిషేధించారు. మరోపక్క ఘటనా స్థలం పక్కనే గోవిందరాజస్వామి రథం ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే రథ మండపానికి కూడా మంటలు వ్యాపించాయి.

ఇక ఫోటో ఫ్రేమ్ షాప్ ఉన్న నాలుగంతస్తుల భవనం మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. మంటల ధాటికి భవనం ముందు ఉన్న బైకులు కూడా కాలిపోయాయి. పక్కనే ఉన్న భవనాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Jyothi

Jyothi

Next Story