ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో భారీ అగ్ని ప్రమాదం

Eluru Fire Accident: *పూర్తిగా మంటల్లో కాలిపోయిన రెండు ఫోర్లు *నలుగురు మృతి... 13 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరు పరిస్థితి మిషమం

Rama Rao
Updated on: 14 April 2022 7:18 AM IST
Fire Accident in Eluru Chemical Factory
X

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో భారీ అగ్ని ప్రమాదం

Eluru Fire Accident: ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోసర్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలిసింది. రెండు ఫ్లోర్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో ప్లాంట్ మేనేజర్ శుక్లా ఉన్నారు.

గాయపడ్డ వారిలో 8మందిని విజయవాడకు , నలుగురిని నూజివీడుకు తరలించారు. మొదటి అంతస్తులో మంటలు అదుపులోకి వచ్చాయి. రెండో అంతస్తులో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది యత్నించారు. మృతులు నలుగురు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. మరో రియాక్టర్ పేలిపోయే ప్రమాదం ఉందని చెప్పడంతో అక్కడిరెడ్డిగూడెం వాసులు దూర ప్రాంతాలకు తరలి వెళ్లారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఫ్యాక్టరీ యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది.

Rama Rao

Rama Rao

Next Story